![]() |
![]() |
బిగ్ బాస్ ప్రేరణ గురించి తెలియని వారు లేదు. ఇష్మార్ట్ జోడి సీజన్ 3 లో ప్రేరణ ఆమె భర్త శ్రీపద్ సీజన్ విన్నర్స్ గా నిలిచారు. ఈ సీజన్ లోని జోడీస్ ని ఇప్పుడు శ్రీముఖి ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి తీసుకొచ్చింది. ఇందులో వీళ్ళతో ఎన్నో గేమ్స్ కూడా ఆడించింది. ఐతే ప్రేరణను శ్రీపద్ చేతుల్లో ఎత్తుకుని షో స్టేజి మీదకు వచ్చాడు. ఎలా అంటే పుష్ప మూవీలో శ్రీవల్లిని ఎత్తుకుని వచ్చినట్టు. తరువాత "సూసీకి" సాంగ్ కి డాన్స్ చేశారు. "మీ అందరికీ అర్ధం కావట్లేదు. పుష్ప మూవీ చూసిన వాళ్ళకే అర్ధమవుద్ది..శ్రీపద్ జాగ్రత్తగా అలా ప్రేరణని అలా ఎత్తుకుని తీసుకొచ్చాడు అంటే ఈ పాటలో రష్మిక మందన్న ఏంటో మీ అందరికీ తెలుసు కదా" అని అనేసరికి శ్రీపద్ షాకయ్యాడు. హరి, అవినాష్, శ్రీముఖి కలిసి కంగ్రాట్యులేషన్స్ అని చెప్పేసరికి "ఎవరికీ..ఎవరికీ" అంటూ ప్రేరణ గట్టిగ అడిగింది. "ఎక్కడా వన్ ఇయర్ లో నాలుగు నెలలు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఎక్కడ వస్తుంది అవుట్ పుట్" అని డైరెక్ట్ గా అడిగేశాడు శ్రీపద్. ఇక ఈ విషయాన్నీ కవర్ చేస్తూ శ్రీముఖి "సో టాప్ 5 లో ఆగిపోయిందని అనుకున్నారేమో మా లేడీ ఫైటర్. కానీ కప్పు గెలుచుకుని వెళ్ళింది..ఇంతకు ఆ కప్పును ఇంటికి తీసిన డిసిఎం వాన్ కి ఎంత ఖర్చు అయ్యింది" అని అడిగేసరికి హరి మధ్యలో వచ్చి "ఆ కప్పును చూసి ఇంటికి కొత్త ఫ్రిజ్ వచ్చినదని పక్కింటి వాళ్ళు" అన్నారట అని కామెడీ చేసాడు. మరి శ్రీపద్ చెప్పింది కరెక్ట్ కదా. పెళ్లైన వెంటనే హనీమూన్ కి వెళ్లకుండా బిగ్ బాస్ హౌస్ కి వచ్చేసింది ఆ తర్వాత ఇష్మార్ట్ జోడికి వచ్చేసింది ప్రేరణ. ఇలా కంటిన్యుయస్ గా షోస్, ఈవెంట్స్ చేస్తూ ఉంటే అవుట్ పుట్ కోసం ఇంకా టైం అనేది ఎక్కడ ఉంటుంది అని చాలా క్లియర్ గా చెప్పాడు.
![]() |
![]() |